ఆధ్యాత్మికను చాటే యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా (YSS) సామాజిక బాధ్యతను కూడా నిర్వర్తిస్తోంది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో పలుచోట్ల కురిసిన భారీ వర్షాలకు తీవ్రనష్టం సంభవించింది. చాలామంది నిరాశ్రయులయ్యారు. లోతట్టు ప్రాంతాలు జలమయమై కొన్ని కుటుంబాలు సర్వస్వం కోల్పోయాయి. ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి, వరద సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. కొంతమంది సీఎం సహాయనిధికి విరాళాలు ఇచ్చి ఉదారతను చాటుకున్నారు. YSS కార్యదర్శి స్వామి ఈశ్వరానంద గిరి కూడా ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామిని డెహ్రాడూన్‌లోని ఆయన కార్యాలయంలో కలిసి రూ.25 లక్షల చెక్కును అందజేశారు. అలాగే కొన్ని పరమహంస యోగానంద ఆధ్యాత్మిక పుస్తకాలనూ బహూకరించారు. ఈ సందర్భంగా YSSకు ధామి కృతజ్ఞతలు తెలిపారు.

More Stories
ఉష్ట్ర వాహనధారి సన్నిధిలో వినాయక మహోత్సవాలు..
తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత..
ఈసారి విశ్వశాంతి మహాశక్తి గణపతిగా..