హాల్‌మార్కింగ్ – ఆభరణాల స్వచ్ఛతను ధృవీకరించే అధికారిక గుర్తు. ఆభరణాలలో లోహాల నిష్పత్తిని నిర్ధారించి, కొనుగోలుదారులకు నాణ్యత గురించి ఇచ్చే హామీ. లోహాల కల్తీ లేదా తక్కువ నాణ్యత గల ఆభరణాల విక్రయాన్ని నియంత్రించడం దీని ముఖ్యోద్దేశం. బంగారానికి ఇప్పటికే హాల్‌మార్క్ ఉన్న విషయం తెలిసిందే. ఈ రోజు (సెప్టెంబర్ 1) నుంచి వెండికి కూడా ఈ మార్క్ రాబోతుంది. ఆరు అంకెల నంబర్‌ను కేటాయించనున్నారు.

అమల్లోకి స్పీడ్‌పోస్ట్..
రిజిస్టర్డ్ పోస్టు విధానాన్ని స్పీడ్ పోస్టులో విలీనం చేస్తూ ఇటీవల తపాలా శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ విధానం సెప్టెంబరు ఒకటి నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రానుంది. ఈ రోజు నుంచి అన్ని పోస్టాఫీసుల్లో రిజిస్టర్ పోస్టు అనే మాట వినిపించదన్నమాట. దాని స్థానంలో స్పీడ్ పోస్టు వచ్చేసింది.

More Stories
నగదు బదిలీ, స్కాలర్షిప్ పొందాలంటే ఆధార్ అప్డేట్ తప్పనిసరి..
Trending Topics