హైదరాబాద్: వినాయక చవితి సందర్భంగా మీ ఏరియాలో మండపాన్ని ఏర్పాటు చేసి గణనాథుడిని ఏర్పాటు చేయాలనుకుంటున్నారా? అయితే ఈ నిబంధనలు తప్పనిసరి..
ఉత్సవాలను దృష్టిలో ఉంచుకుని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి వినతి మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మండపాలకు ఉచితంగా విద్యుత్ సరఫరాకు అంగీకరించింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వు కూడా జారీ చేసింది. ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 6 వ తేదీ వరకు 11 రోజుల పాటు మండపాలకు ఉచితంగా కరెంట్ వాడుకోవచ్చు. ఇందుకు ముందుగా విద్యుత్ అధికారులను సంప్రదించి వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
మండపాల నిర్వాహకులు ఇవి పాటించాల్సిందే..
- మండపం ఏర్పాటుకు ఆన్లైన్లో పర్మిషన్ తప్పనిసరి. అనుమతి కోసం మండపాల నిర్వాహకులు https://policeportal.tspolice.gov.in/index.htm దరఖాస్తు చేసుకోవాలి.
- మండపాలకు విద్యుత్ సరఫరా పనులు నిపుణులతో చేయించాలి. అనుభవం లేని వారు చేయడం వల్ల విద్యుత్ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.
- మండపాల కోసం రోడ్లను బ్లాక్ చేయొద్దు. ప్రజలకు అసౌకర్యం కలిగించొద్దు.
- డీజేలకు అనుమతిలేదు. రాత్రి 10 గంటల తర్వాత మైక్ వాడొద్దు.
- మైక్‌లు వాడేటప్పుడు సౌండ్ లెవెల్స్ ప్రభుత్వ నిబంధనల మేరకే ఉండాలి.
- మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి.
- ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించాలి.
- వర్షాలను దృష్టిలో పెట్టుకొని మండపాలకు ఏర్పాట్లు చేసుకోవాలి.
- భక్తుల తాకిడికి తగినట్లుగా మండపాల వద్ద ఏర్పాట్లు తప్పనిసరి.
- వాహనాలు పార్క్ చేసుకొనేందుకు ప్రత్యేక స్థలాలు ఏర్పాటు చేయాలి.
- ట్రాఫిక్‌కు ఆటంకం కలిగించొద్దు.
- ట్రాఫిక్, భక్తుల క్యూలైన్ల నియంత్రణ కోసం వలంటీర్లను ఏర్పాటుచేసుకోవాలి.
- మండపాల దగ్గర శుభ్రత పాటించాలి.
- మండపాల వద్ద పాయింట్ బుక్ ఏర్పాటు చేయాలి. మండప నిర్వాహకుల కమిటీ సభ్యుల పూర్తి వివరాలు (పేరు, తండ్రిపేరు, ఫోన్ నంబర్, చిరునామా) కమిటీ ప్రెసిడెంట్/కన్వీనర్/సెక్రటరీ ఎవరో స్పష్టంగా నమోదు చేయాలి.
- అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి.
- ప్రభుత్వం/జీహెచ్ఎంఎసీ/పోలీస్ శాఖ సూచించిన ఏరియాలో మాత్రమే నిమజ్జనం చేయాలి. పోలీసులు ఇచ్చిన అనుమతి కాపీని మండపంలో కనబడేలా ప్రదర్శించాలి.

ఆధ్మాత్మిక కార్యక్రమాల విశేష సమాచారం కోసం క్లిక్ చేయండి..www.divyadarshanam.in
అలాగే మీరు నిర్వహించే, మీ పరిధిలో జరిగే ఆధ్మాత్మిక కార్యక్రమాల వివరాలను మాకు (వెంకట్ – వాట్సప్ నంబర్ 83338 71117) తెలపండి.
More Stories
సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ – 2026
కన్నుల పండువగా పరమహంస యోగానంద జయంతి
హైదరాబాద్ బుక్ఫెయిర్లో ప్రపంచ ధ్యాన దినోత్సవం