హైదరాబాద్: క్రియయోగ ధ్యానంతో ఒత్తిడి దూరమౌతుందని యోగోదా సత్సంగ సొసైటీ సాధకులు తెలిపారు. క్రియాయోగంతో ఆత్మ సాక్షాత్కారం సాధ్యమౌతుందని వై ఎస్ ఎస్ మేనేజంగ్ కమిటీ సభ్యురాలు శశివదనా రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ బుక్‌ఫెయిర్‌లో ఆదివారం వైఎస్‌ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ ధ్యాన దినోత్సవ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఐక్యరాజ్యసమితి డిసెంబర్ 21ని ప్రపంచ ధ్యాన దినోత్సవంగా ప్రకటించిన విషయాన్ని వారు గుర్తు చేశారు.

ఈ సందర్భంగా వైఎస్‌ఎస్ సాధకులు తమ అనుభవాలను పంచుకున్నారు. ధ్యానం ద్వారా ఆందోళన తగ్గి జీవితం ఎలా ప్రశాంతంగా, సమతుల్యంగా మారిందో వివరించారు. హైదరాబాద్ బుక్‌ఫెయిర్‌లో 49, 50, 51 నెంబరు గల స్టాళ్లలో క్రియయోగ ధ్యాన పాఠాల వివరాలు తెలుసుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు.
More Stories
భక్తి శ్రద్ధలతో పరమహంస యోగానంద మహాసమాధి ఆరాధనోత్సవాలు
సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ – 2026
కన్నుల పండువగా పరమహంస యోగానంద జయంతి