‘‘ఆత్మసాక్షాత్కారానికి ప్రాథమిక మార్గం క్రియాయోగం’’

హైదరాబాద్: డిసెంబర్ 21ని ప్రపంచ ధ్యాన దినోత్సవంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించినప్పటి నుంచి ప్రపంచ వ్యాప్తంగా ధ్యానంపై ఆసక్తి పెరుగుతోంది. ధ్యానాన్ని భగవంతుడ్ని చేరే మార్గంగా ఆధ్యాత్మికవేత్తలు నిర్వచిస్తుంటారు. రోజూ కొంత సమయానైనా ధ్యానానికి కేటాయించడం ద్వారా మానసిక ప్రశాంతతతో పాటు శారీరక ఆరోగ్యాన్ని మెరుగు పరుచుకోగలుగుతాం.

పశ్చిమ దేశాలలో యోగ పితామహునిగా విస్తృతంగా గుర్తింపు పొందిన, ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందిన “ఒక యోగి ఆత్మకథ” (Autobiography of a Yogi) గ్రంథ రచయిత ‘‘పరమహంస యోగానంద’’ ధాన్యం గురించి చెబుతూ.. ‘‘అత్యంత ప్రాముఖ్యత కలిగినది ధ్యానం. ధ్యాన ప్రక్రియలో ఒకటైన క్రియా యోగం ఒక సమగ్ర, వైజ్ఞానిక, సర్వవ్యాప్త పద్ధతి. ఈ ప్రక్రియలో ప్రతి వ్యక్తి సంపూర్ణ మానసిక శాంతిని పొందుతాడు. క్రియాయోగం – దాని అనుబంధ పద్ధతులు శరీరం, మనస్సు, ఆత్మకు ఎంతో అవసరమైన పునరుజ్జీవనాన్ని అందిస్తాయి.’’ అని పేర్కొన్నారు.

‘యోగ’ అనే పదం వాస్తవానికి భగవంతునితో ఐక్యాన్ని సూచిస్తుంది. యోగ మార్గంలో ధ్యాన సాధన ఒక అంతర్భాగం. ‘‘పరమహంస యోగానంద’’ ద్వారా 1917లో స్థాపించబడిన ‘‘యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా (YSS)’’ – ఆ మహాగురువు ఉపదేశించిన క్రియాయోగ బోధనలను వ్యాప్తి చేస్తోంది. ఆయన బోధనలు ‘‘ఆత్మసాక్షాత్కారం’’ అనే ఉన్నత లక్ష్యాన్ని సాధించడానికి ప్రాథమిక మార్గం. ‘ఒక యోగి ఆత్మకథ’లో, పరమహంస యోగానంద క్రియాయోగ ధ్యాన విజ్ఞానం అన్ని ఇతర ఆధ్యాత్మిక సాధనా పద్ధతుల కంటే ఉన్నతమైనదని, భక్తితో కూడినప్పుడు, అది అంతిమ లక్ష్యాన్ని సాధించడంలో ఖచ్చితంగా సఫలం అవుతుందని పేర్కొన్నారు.

ధ్యానాన్ని తమ దైనందిన దినచర్యలో అచరించని వారు, వివిధ రకాల వృత్తినిపుణులు తమ తప్పును ఆలస్యంగా గ్రహించారు. ఒత్తిడితో కూడిన దైనందిత జీవితంతో ధ్యాన సాధన ఎంతో అవసరం.
క్రమం తప్పకుండా ధ్యానం చేసే సీఈవోలు వారి వృత్తి, వ్యక్తిగత జీవితంలో విజయవంతం అయ్యారని హార్వర్డ్ విశ్వవిద్యాలయం అధ్యయనం వెల్లడించింది. మనస్తత్వ ఆరోగ్య నిపుణులు కూడా ఆరోగ్యకర, సంతోషకర, సంతృప్తికర జీవితం గడపడానికి ధ్యానం ఒక అద్భుత మార్గం అని సూచిస్తారు.

ధ్యానానికి ఎంత ఎక్కువ సమయం కేటాయించగలిగితే అంత మంచిది. ఏళ్ల తరబడి చేసే ధ్యానం ప్రతి మానవుడిని ఉల్లాసంగా, సమతుల్యంగా, సమర్థవంతంగా, శారీరకంగా కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది.

పరమహంస యోగానంద ఒక సందర్భంలో ఇలా అన్నారు.. “ఇది వేచి ఉండగలదు, అది వేచి ఉండగలదు, కానీ భగవంతుని కోసం మీ అన్వేషణ ఆగకూడదు!” ఆ అన్వేషణను వేగవంతం చేసే మార్గం ధ్యానమే!

పరమహంస యోగానందకు గురువైన స్వామి శ్రీయుక్తేశ్వర్ గిరిగా ప్రసిద్ధి. ఎంతో స్ఫూర్తిదాయకంగా ధ్యానం గురించి ఇలా చెప్పారు: “మీరు ఇప్పుడు ఆధ్యాత్మిక ప్రయత్నం చేస్తే భవిష్యత్తులో ప్రతిదీ మెరుగుపడుతుంది”.

ఈ జీవితంలో శాశ్వత శాంతిని, ఆనందాన్ని మనం కనుగొనాలంటే ధ్యానం ఒక ఐచ్ఛిక కార్యం కాదని, అది మన జీవితాలలో తప్పనిసరి చర్య అని ప్రపంచ ధ్యాన దినోత్సవం మనందరికీ గుర్తుచేసే విధంగా ఉండాలి.

(ప్రపంచ ధ్యాన దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం..)

మరింత సమాచారం కోసం: yssofindia.org

Follow us on social media

Phone icon
8333871117
Contact us!
WhatsApp icon
8333871117