విజయవాడ: విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో నేటి (ఆగస్టు 27) నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చారు. సంప్రదాయ దుస్తులు ధరించిన వారిని మాత్రమే ఆలయంలోకి అనుమతిస్తారు. ఆలయం లోపల సెల్ఫోన్ వాడకం పూర్తిగా నిషేధం. ఇక ప్రోటోకాల్ దర్శనాలకు వచ్చే వారు తమ సెల్ఫోన్లను ఆలయ కార్యాలయంలో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఉద్యోగులందరికీ కూడా సంప్రదాయ దుస్తులు తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది ఆలయ పాలక మండలి.
సంప్రదాయ దుస్తుల్లో ఆలయ ప్రవేశం హిందూ సంప్రదాయం. దసరా శరన్నవరాత్రుల్లో అమ్మవారి దర్శనానికి వచ్చే లక్షలాది భక్తులను దృష్టిలో ఉంచుకుని సంప్రదాయ వస్త్రధారణ తప్పనిసరి చేశారు. ఇప్పటికే తిరుమల శ్రీవారి ఆలయంలో సంప్రదాయ వస్త్రధారణ విజయవంతంగా అమలవుతోంది. ఆ విధానాన్ని కనకదుర్గమ్మ ఆలయంలోనూ అమలు చేయాలని పాలక మండలి సభ్యులు అభిప్రాయపడ్డారు. ఆలయ ప్రవేశానికి ముందు పురుషులు ధోతి, అంగవస్త్రం ధరించాలి. మహిళలు చీర, హాఫ్ సారీ లేదా సంప్రదాయ రీతిలో ఉండే వస్త్రాలు ధరించాల్సి ఉంటుంది.
More Stories
సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ – 2026
కన్నుల పండువగా పరమహంస యోగానంద జయంతి
హైదరాబాద్ బుక్ఫెయిర్లో ప్రపంచ ధ్యాన దినోత్సవం