తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు..

తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో సెప్టెంబర్ 24 నుంచి అక్టోబరు 2 వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు. 23న సాయంత్రం మీన లగ్నంలో అంకురార్పణతో వేడుకలు మొదలుకానున్నాయి. ప్రతిరోజూ ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 7 నుంచి 9 గంటల వరకు వాహన సేవలు జరగనున్నాయి.

ఏరోజు.. ఏ వాహనంపై..
24 వతేదీ పెద్ద శేష వాహనం. రాత్రి పెద్ద శేష వాహనం.
25 వతేదీ చిన్న శేష వాహనం, రాత్రి హంస వాహనం
26వతేదీ సింహ వాహనం, రాత్రి ముత్యపు పందిరి వాహనం
27వ తేదీ కల్పవృక్షం వాహనం, రాత్రి సర్వ భూపాల వాహనం
28వ తేదీ మోహినీ అవతారం, రాత్రి గరుడ వాహనం
29వ తేదీ హనుమంత వాహనం, రాత్రి గజ వాహనం
30వ తేదీ సూర్యప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభ వాహనం
అక్టోబర్ 1వ తేదీ రథోత్సవం, రాత్రి అశ్వ వాహనం
2వ తేదీ చక్రస్నానం, రాత్రి 8:30 నుంచి 10 గంటల వరకు ధ్వజావరోహణం.

25, 26, 27 తేదీల్లో మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. 28న గరుడ సేవ సాయంత్రం 6.30 నుంచి అర్ధరాత్రి వరకూ ఉంటుంది. 29న సాయంత్రం 4 గంటల నుంచి స్వర్ణ రథోత్సవం ఉంటుంది.

 

Follow us on social media

Phone icon
8333871117
Contact us!
WhatsApp icon
8333871117