వైద్యారోగ్య శాఖలో 1,623 ఉద్యోగాలు..

తెలంగాణ(Telangana) వైద్యారోగ్యశాఖ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. 1,623 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌, మెడికల్ ఆఫీసర్‌ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హులు సెప్టెంబర్‌ 22వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 8 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది.

ఉద్యోగాలు: స్పెషలిస్ట్‌ డాక్టర్లు (మొత్తం 24 విభాగాల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు)
అర్హతలు: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో పీజీ/డిప్లొమా/డీఎన్‌బీలో పాసై ఉండాలి. దీనికితోడు వర్క్ ఎక్స్‌‌పీరియన్స్ ఉండాలి.
వయోపరిమితి: జులై 1, 2025 నాటికి 18 నుంచి 46 ఏళ్లు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులకు వయోపరిమితి ఉంటుంది.
జీతం: రూ.58,850 – రూ.1,37,050
దరఖాస్తుల ప్రక్రియ: ఆన్‌లైన్
దరఖాస్తులు ప్రారంభం: 8 సెప్టెంబర్ 2025.
దరఖాస్తులకు చివరి తేదీ: 22 సెప్టెంబర్‌ 2025.
ఎంపిక విధానం: విద్యార్హతల్లో సాధించిన మెరిట్ ఆధారంగా..
మొత్తం 100 పాయింట్లను ప్రామాణికంగా తీసుకుని ఎంపిక చేస్తారు. వర్క్ ఎక్స్‌‌పీరియన్స్ (కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్) పాయింట్లు కేటాయిస్తారు.
అధికారిక వెబ్ సైట్ https://mhsrb.telangana.gov.in/MHSRB/home.htm

అప్‌లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్:
ఆధార్ కార్డు, టెన్త్ మెమో, డిగ్రీ, పీజీ మెమోలు, తెలంగాణ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, స్టడీ సర్టిఫికెట్లు, ఎక్స్‌‌పీరియన్స్ సర్టిఫికెట్లు, కుల ధ్రువీకరణ పత్రం, ఆదాయ ధ్రువీకరణపత్రం
అభ్యర్థి ఫొటో, సంతకంతో పాటు ఇతర పత్రాలు..

Follow us on social media

Phone icon
8333871117
Contact us!
WhatsApp icon
8333871117