హైదరాబాద్: చిన్ని గుండెకు పుట్టుకతోనే ఏదో ఇబ్బంది. లబ్‌డబ్ శబ్దం ఏ క్షణాన మూగబోతుందన్న భయం..తల్లిదండ్రులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. వేలు, లక్షల్లో ఖర్చయ్యే వైద్యం. భరించలేక స్థితిలో పేదరికం. ఆర్థిక ఇబ్బందులతో చికిత్సకు నోచుకోని చిన్నారులకు నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెన్ (NIMS) అండగా నిలుస్తోంది. గుండె శస్త్రచికిత్సలను ఉచితంగా చేయబోతుంది. ఆ వివరాలు నిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ నగరి బీరప్ప మాటల్లోనే..

‘‘పుట్టుకతోనే గుండె సంబంధ వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులకు నిమ్స్‌లో ఆపరేషన్లు చేయబోతున్నాం. బ్రిటన్ వైద్యుల సహకారంతో సెప్టెంబర్ 1 నుంచి 21 వరకు ఈ శస్త్ర చికిత్సలు జరుగుతాయి. ముందుగా వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి తక్షణమే ఆపరేషన్లు చేస్తారు. ఆసుపత్రి పాత భవనంలోని సీటీవీఎస్ గదిలో డా. అమరేష్ రావు, డా. ప్రవీణ్, డా. గోపాల్ ఈ పరీక్షలు చేస్తారు. ప్రతి మంగళ, గురు, శుక్రవారాల్లో ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పరీక్షిస్తారు. ఆసుపత్రికి వచ్చే ముందు పిల్లల తల్లిదండ్రులు పాత రిపోర్టులన్నింటిని వెంట తీసుకురావాలి. ఆపరేషన్ అయ్యే మొత్తం ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ, సీఎంఆర్ఎఫ్ ద్వారా భరిస్తోంది.’’ అని చెప్పారు.
More Stories
సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ – 2026
కన్నుల పండువగా పరమహంస యోగానంద జయంతి
హైదరాబాద్ బుక్ఫెయిర్లో ప్రపంచ ధ్యాన దినోత్సవం