- ఇద్దరు క్రియా గురువుల మహాసమాధి
- ఎన్నటికీ వీడని బంధం – గురుశిష్య బంధం
హైదరాబాద్: “ఒక యోగి ఆత్మకథ” రచయిత, యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకులు పరమహంస యోగానంద మహాసమాధి ఆరాధనోత్సవాలను దేశవ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. హైదరాబాద్ బేగంపేట చికోటి గార్డెన్స్ లోని యోగదా సత్సంగ ధ్యాన కేంద్రంలో భక్తులు ధ్యానం, భజనలు, పుష్పాంజలి కార్యక్రమం నిర్వహించారు. వైఎస్ఎస్ ప్రధాన కార్యాలయం ఉన్న రాంచీలో సాధు భండారా కార్యక్రమం నిర్వహించారు.
మహాసమాధి అంటే..
దైవసాక్షాత్కారం పొందిన గురువును మృత్యువు దరిచేరదు. అటువంటి గురువు తన మరణ సమయంలో సంపూర్ణ చైతన్యంతో ఈ మానవ శరీరం నుంచి నిష్క్రమిస్తారు. దీనినే మహాసమాధి అంటారు.

ఒకే మాసంలో ఇద్దరు మహనీయులు..
క్రియాయోగంలో అసమానమైన ఇద్దరు మహనీయుల మహాసమాధిని మార్చి నెల గుర్తు చేస్తుంది. 1952 మార్చి 7న పరమహంస యోగానంద, అంతకుముందు 1936 మార్చి 9న ఆయన గురువు, “ కైవల్యదర్శనం” రచయిత యుక్తేశ్వర్ గిరి మహా సమాధి చెందారు. అయితే ఈ ఇద్దరు గురువులు, తమ శిష్యులకు తమ శక్తిని ఇంకా ఇస్తూనే ఉన్నారు. “మీ వెంటే ఉంటూ అదృశ్య హస్తాలతో మిమ్మల్ని కాపాడుతాను.” అని యోగానంద 97 ఏళ్ల క్రితం రాసిన ఒక పద్యంలో తన శిష్యులకు శాశ్వతమైన మాట ఇచ్చారు.

యోగానంద నుంచి క్రియా యోగ గురువుగా..
యోగానంద 17 సంవత్సరాల వయస్సులో కాశీలో యుక్తేశ్వర్ను తొలిసారి కలుసుకున్నారు. అప్పుడు ఆయన హృదయంలో తన గురువు ఎవరో తెలుసుకోవడానికి తీవ్రమైన ఆరాట పడేవారు. కాశీ సందులలో తిరుగుతూ యుక్తేశ్వరే తన గురువుగా తెలుసుకున్నారు. ఆ సమయం నుంచి, యోగానంద తన గురువు బాటలో కఠినమైన క్రమశిక్షణతో సుశిక్షితులయ్యారు. యోగానందను యుక్తేశ్వర్ పదేళ్లపాటు తీర్చిదిద్దారు. దాని వల్ల రాబోయే సంవత్సరాలలో యోగానందను ప్రపంచవ్యాప్తంగా క్రియా యోగ గురువుగా గుర్తింపు పొందారు. సాటిలేని మహావతార్ బాబాజీ ఆయనకు అప్పగించిన బాధ్యతను దివ్యంగా నెరవేర్చారు యుక్తేశ్వర్ గిరి. అదే క్రియాయోగంలో, 30 సెకన్ల ఒక శక్తివంతమైన క్రియా శ్వాస సహజ మానవ పరిణామంలో ఒక సంవత్సరానికి సమానం.

నిర్జీవంలోనూ సజీవంగా..
క్రియా యోగానికి అతి పెద్ద నిదర్శనం పరమహంస యోగానంద మహాసమాధి. మరణించిన 20 రోజుల తర్వాత కూడా ఆయన శరీరంలో ఎటువంటి మార్పులు లేవు. సజీవంగా ఉన్నపుడు ఎలా ఉన్నారో అలాగే ఉన్నారు. మార్చురీ డైరెక్టర్ హ్యారీ టి. రోవే నమోదు చేసిన వివరాల ప్రకారం, పరమహంస యోగానంద శరీరం “అద్భుత నిర్వికారస్థితి”లో ఉంది. ఆ గొప్ప గురువు, తన జీవితంలో ఎలా ఉన్నారో, మరణంలో కూడా అలాగే ఉన్నారు. యోగా, ధ్యానం ద్వారా ప్రకృతి శక్తులను అదుపు చేయవచ్చని మానవాళికి నిరూపించారు.’’ అని చెప్పారు.
“ఒక యోగి ఆత్మకథ”లో వివరించిన విధంగా, క్రియాయోగం అనేది ప్రతి శ్వాసతో రక్తాన్ని కర్బన రహితం (డీకార్బనైజ్) చేసే ఒక సాధనం. చివరికి ఇది శరీర క్షీణతను నిరోధిస్తుంది. ఇది శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించినది. ఆ తర్వాత పతంజలికీ, మనందరికీ తెలిసిన ప్రాచీన విజ్ఞానం. ఈ యుగంలో, మహావతార్ బాబాజీ దీనిని లాహిరీ మహాశయులకు ఇచ్చారు. ఆయన దానిని యోగానంద గురువు యుక్తేశ్వర్ గిరికి అందించారు. అలా పరంపరగా మహోన్నత జీవధార ప్రవహిస్తోంది.
రాంచీలో వై.ఎస్.ఎస్..
క్రియాయోగ బోధనలను వ్యాప్తి చేయడానికి, యుక్తేశ్వర్ ఒక సంస్థను స్థాపించాలని నొక్కి చెప్పారు. అన్నింటికీ మించి, అలాంటి బోధనను పంచుకోవాల్సిన అవసరం ఉంది. యోగానంద 1917లో రాంచీలో యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా (వై.ఎస్.ఎస్) ను, 1920లో లాస్ ఏంజిలిస్లో సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ (ఎస్.ఆర్.ఎఫ్) ను స్థాపించారు. ఈ ధ్యాన శాస్త్రీయ పద్ధతులను నేర్చుకోవడానికి దశలవారీ సూచనలను అందించే స్వీయ-సాక్షాత్కారం కోసం గృహ-అధ్యయన పాఠాలకు యోగదా ఆశ్రమాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
పరమహంస యోగానంద మాటలలో, “నా తర్వాత, ఈ బోధనలే గురువుగా మార్గదర్శనం చేస్తాయి. ఈ బోధనల ద్వారా మీరు నాతోనూ, నన్ను పంపిన మహా గురువులతోనూ ఎప్పుడూ కలిసే ఉంటారు.”
మరింత సమాచారం కోసం: yssofindia.org
More Stories
సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ – 2026
కన్నుల పండువగా పరమహంస యోగానంద జయంతి
హైదరాబాద్ బుక్ఫెయిర్లో ప్రపంచ ధ్యాన దినోత్సవం