కాణిపాకంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం..

చిత్తూరు: చిత్తూరు జిల్లా కాణిపాకం వరసిద్ధి వినాయకుడి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఏటా వినాయకచవితి రోజున ప్రారంభమై.. సెప్టెంబర్ 16వ తేదీ వరకు ఈ ఉత్సవాలు కొనసాగుతాయి. వినాయక చవితి రోజున ఏపీ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరుపున పట్టువస్త్రాలు సమర్పించారు.

ఏ రోజు.. ఏ వాహనంపై..

  • ఆగస్టు 28న ధ్వజారోహణం, రాత్రి హంసవాహన సేవతో స్వామివారి వాహనసేవలు ప్రారంభమయ్యాయి.
  • ఆగస్టు 29న రాత్రి స్వర్ణనెమలి వాహనంపై స్వామివారిని ఊరేగిస్తారు.
  • ఆగస్టు 30న రాత్రి మూషిక వాహన సేవ
  • ఆగస్టు 31న చిన్న శేషవాహనం, రాత్రి పెద్దశేషవాహన సేవ
  • సెప్టెంబర్ 1న చిలుకవాహనం, రాత్రి వృషభవాహన సేవ
  • సెప్టెంబర్ 2న రాత్రి గజవాహన సేవ
  • సెప్టెంబర్ 3వ తేదీ మధ్యాహ్నం రథోత్సవం
  • సెప్టెంబర్ 4వ తేదీ రాత్రి తిరుకల్యాణం, అశ్వవాహన సేవ
  • సెప్టెంబర్ 5వ తేదీ సాయంత్రం ధ్వజావరోహణం, ఏకాంతసేవతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.

ప్రత్యేక ఉత్సవాల్లో భాగంగా..

  • సెప్టెంబర్ 6న రాత్రి నంది వాహనసేవ
  • సెప్టెంబర్ 7న రావణబ్రహ్మ వాహనసేవ నిర్వహించాలి. కానీ ఆ రోజు చంద్రగ్రహణం కారణంగా ఆ సేవను ఉదయం నిర్వహిస్తారు.
  • సెప్టెంబర్ 8న యాళివాహన సేవ
  • సెప్టెంబర్ 9న రాత్రి సూర్యప్రభ వాహనసేవ
  • సెప్టెంబర్ 10వ తేదీ చంద్రప్రభ వాహనసేవ
  • సెప్టెంబర్ 11వ తేదీ రాత్రి కల్పవృక్షసేవ
  • సెప్టెంబర్ 12వ తేదీ రాత్రి విమానోత్సవం
  • సెప్టెంబర్ 13న రాత్రి పుష్పపల్లకీసేవ
  • సెప్టెంబర్ 14వ తేదీ రాత్రి కామధేనువాహనసేవ
  • సెప్టెంబర్ 16వ తేదీ రాత్రి తెప్పోత్సవంతో ప్రత్యేక ఉత్సవాలు ముగుస్తాయి.

కాణిపాకం ఎలా వెళ్లాలి..
చిత్తూరు జిల్లాలోని కాణిపాకం వరసిద్ధుడి వినాయకుడి ఆలయానికి దేశ, విదేశాల నుంచి భక్తులు వస్తుంటారు. చిత్తూరు నుంచి ఈ ఆలయం 11 కిలోమీటర్ల దూరంలో, తిరుపతి నుంచి సుమారు 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. తిరుపతి ఆర్టీసీ సెంట్రల్ బస్టాండు నుంచి ప్రతిగంటకు ఓ బస్సు అందుబాటులో ఉంటుంది.

ఆర్టీసీ బస్సు చార్జీ: తిరుపతి నుంచి కాణిపాకం వెళ్లడానికి ఒకరికి రూ.110 చార్జీ వసూలు చేస్తారు. అయితే స్త్రీశక్తి పథకం కింద మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు.

Follow us on social media

Phone icon
8333871117
Contact us!
WhatsApp icon
8333871117