హైదరాబాద్: వినాయక చవితి వచ్చిందంటే అత్యంత భారీ వినాయకుడి గురించి వార్తలొస్తుంటాయి. అలాగే ఖరీదయిన గణనాథుడి గురించి కూడా. మరి ఈ సారి ఆ రికార్డు ఎవరు దక్కించుకున్నారో తెలుసుకుందాం..
ఏపీలో 126 ఎత్తున్న విఘ్నేశుడు..
దేశంలోనే అతిభారీ మట్టి వినాయక విగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనకాపల్లి జిల్లాలో ఏర్పాటు చేశారు. గిన్నిస్ బుక్‌లో చోటు దక్కించుకోవడమే లక్ష్యంగా 126 అడుగుల ఈ విగ్రహం తయారీకి నిర్వాహకులు సుమారు రూ.70 లక్షలు ఖర్చుచేశారు. 45 మంది కార్మికులు.. దాదాపు రెండు నెలల పాటు శ్రమించి 10 టన్నుల బంక మట్టితో తయారుచేసిన గణనాథుడిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా వస్తున్నారు.

ముంబైలో 474 కోట్ల గణపతి..
ముంబైలోని సియోన్ ఫోర్ట్ ప్రాంతంలో వినాయక చవితి వేడుకలను జీఎస్‌బీ సేవామండల్ ఏటా ఘనంగా నిర్వహిస్తోంది. వీరు ఏకంగా రూ.474.46 కోట్ల బీమా తీసుకున్నారు. గతేడాది రూ.400.58 కోట్లకు చేయించారు. ఈ సారి మరో రూ. 74 కోట్లు పెంచారు. 69 కిలోల బంగారు, 336 కిలోల వెండి ఆభరణాలతో అలంకరించిన గణనాథుడిని చూసేందుకు భక్తులు పోటెత్తుతున్నారు.

ఎవరికి ఎంత బీమా..
స్వచ్ఛంద సేవకులు, వంటమనుషులు, పూజారులు, చెప్పుల స్టాండ్ నిర్వాహుకులు, దుకాణ కార్మికులు, వలంటీర్లు, సెక్యూరిటీ గార్డులకు కలిపి రూ.375 కోట్లతో ఇన్యూరెన్స్ తీసుకున్నారు. బంగారం, వెండి ఆభరణాలకు రూ.67.03 కోట్ల బీమా, మరో రూ.30 కోట్లతో మండపం, భక్తుల కోసం బీమా చేయించారు. ప్రకృతి విపత్తు కింద మరో రూ. 2 కోట్లతో బీమా తీసుకున్నారు. ఏదైనా అనుకోని ఘటన జరిగితే పరిస్థితి ఏమిటని ఆలోచించిన నిర్వాహకులు ముందు జాగ్రత్తగా భారీ మొత్తంలో బీమా చేయించారు.

More Stories
సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ – 2026
కన్నుల పండువగా పరమహంస యోగానంద జయంతి
హైదరాబాద్ బుక్ఫెయిర్లో ప్రపంచ ధ్యాన దినోత్సవం