సెప్టెంబరు 22 నుంచి దసరా మహోత్సవాలు

శ్రీశైలం: శ్రీశైలం క్షేత్రంలో సెప్టెంబరు 22వ తేదీ నుంచి అక్టోబరు 2వ తేదీ వరకు దసరా మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో శ్రీనివాసరావు తెలిపారు.

శ్రీశైలం పుణ్య క్షేత్రంలో సెప్టెంబరు 22 నుంచి అక్టోబరు 2వ తేదీ వరకు దసరా మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో శ్రీనివాసరావు తెలిపారు. శనివారం ఉత్సవాల నిర్వహణకు సంబంధించి నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఉభయ దేవాలయాల అర్చకులు, అధ్యాపక, వేదపండితులు, ఆలయ సిబ్బంది, పర్యవేక్షకులు పాల్గొన్నారు.

స్వామి అమ్మవార్లకు జరిపించాల్సిన ఆయా కైంకర్యాలను, వాహనసేవలు, ఉత్సవమూర్తికి నవదుర్గ అలంకరణలు, నిజరూపాలంకరణ, రాజరాజేశ్వరి అలంకరణ, దశిమి రోజున శమీపూజ, తెప్పోత్సవం, భక్తులకు సౌకర్యాలు, వాహనాలకు పార్కింగ్‌, క్యూలైన్ల క్రమబద్దీకరణ, దర్శనం ఏర్పాట్లు, అన్నప్రసాద వితరణ, సాంస్కృతిక కార్యక్రమాల గురించి చర్చించారు.

ఈవో శ్రీనివాసరావు మాట్లాడుతూ.. అన్ని విభాగాలు కూడా పరస్పర సమన్వయంతో ఉత్సవాలను విజయవంతం చేయాలన్నారు. ఉత్సవాలను వీక్షించేందుకు వీలుగా ఎల్‌ఈడీ స్ర్కీన్లను ఏర్పాటుచేయాలని ఇంజనీరింగ్‌ విభాగాన్ని ఆదేశించారు.

Follow us on social media

Phone icon
8333871117
Contact us!
WhatsApp icon
8333871117