తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో సెప్టెంబరు 5 నుంచి 7వ తేదీ వరకు మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు (Padmavati Pavitrotsavam) జరగనున్నాయి. సెప్టెంబరు 2వ తేదీ సాయంత్రం విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, మృత్సంగ్రహణం, సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయని తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయ అధికారులు తెలిపారు.
ఏటా 3 రోజుల పాటు ఆనవాయితీగా నిర్వహించే ఈ పవిత్రోత్సవాలలో భాగంగా ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం నిర్వహిస్తారు. సెప్టెంబరు 5న పవిత్రప్రతిష్ఠ, 6న సమర్పణ, 7న పూర్ణాహుతి ఉంటాయని వేదపండితులు తెలిపారు. రూ.750 చెల్లించి పవిత్రోత్సవాల ఆర్జిత సేవలో పాల్గొనే భక్తులకు 2 లడ్డూలు, 2 వడలు ప్రసాదంగా అందజేస్తారు.
సెప్టెంబర్ 2న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం..
పవిత్రోత్సవాలను పురస్కరించుకుని సెప్టెంబరు 2న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, 4న అంకురార్పణ సందర్భంగా తిరుప్పావడ, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ నిర్వహించనున్నారు. 5న అభిషేకానంతర దర్శనం, లక్ష్మీ పూజ, 5, 6,7 తేదీలలో కల్యాణోత్సవం, బ్రేక్ దర్శనం, వేదాశీర్వచనం, కుంకుమార్చన, ఊంజల్‌సేవను రద్దు చేసినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
More Stories
కన్నుల పండువగా పరమహంస యోగానంద జయంతి
‘టీటీడీ వెంకన్న సేవ ఎన్నోజన్మల పుణ్యఫలం’
శ్రీవారి సేవకులకు శిక్షణ.. దరఖాస్తు చేసుకోవడం ఎలా?