నగదు బదిలీ, స్కాలర్‌షిప్ పొందాలంటే ఆధార్ అప్‌డేట్ తప్పనిసరి..

మీ పిల్లల ఆధార్(Aadhar) కార్డును వెంటనే అప్‌డేట్(Update) చేయించండి. లేకపోతే డీయాక్టివేట్‌ అయి నగదు బదిలీ పథకం, స్కాలర్‌షిప్‌ రాకుండాపోయే ప్రమాదం ఉంది. ఏడేళ్లలోపు చిన్నారుల ఆధార్ కార్డును వెంటనే అప్‌డేట్ చేయించాలని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDA) ఇటీవల సూచించింది. అప్‌డేట్ చేయించనివారు వెంటనే ఆధార్ నమోదు కేంద్రాలకు వెళ్లి రూ.100 చెల్లించి, వెంటనే చేయించండి. ఆధార్‌ బయోమెట్రిక్‌ వివరాలు అప్‌డేట్‌ చేయని వారి రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్లకు UIDA సందేశాలు కూడా వచ్చి ఉంటాయి. ఓ సారి చెక్ చేసుకోండి.

ఐదేళ్లలోపు అయితే బ్లూ ఆధార్..
ఐదేళ్లలోపు చిన్నారులకు బాల ఆధార్‌ లేదా బ్లూ ఆధార్‌ జారీ చేస్తారు. తొలుత ఫొటో, పేరు, పుట్టిన తేదీ, చిరునామా వివరాలతో కార్డు జారీ చేస్తారు. ఐదేళ్లు దాటాక ఫింగర్‌ప్రింట్స్‌, ఐరిస్‌, ఫొటో అప్‌లోడ్‌ చేయడం తప్పనిసరి. 5 నుంచి 7 ఏళ్ల మధ్య చిన్నారులకు అప్‌డేషన్‌కు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

Follow us on social media

Phone icon
8333871117
Contact us!
WhatsApp icon
8333871117